Manoj : కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇన్నాళ్లూ డెల్టా వేరియెంట్ గుబులు పుట్టించగా, ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా సినీ సెలబ్రిటీలను వైరస్ వణికిస్తోంది. రీసెంట్ గా కమెడియన్ వడివేలు కరోనాతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఒమిక్రాన్ వచ్చిందంటూ.. రూమర్స్ కూడా వినిపించాయి. అటు కమల్ హాసన్ తోపాటు తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా కరోనా బారిన పడి రీసెంట్ గానే కోలుకున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, నర్సులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని మనోజ్ ట్వీట్ చేశాడు.
గతంలో సినీ సెలబ్స్ చాలా మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఒమిక్రాన్ భయం, థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల నేపథ్యంలో.. స్టార్టింగ్ స్టేజ్ లోనే కోవిడ్ బారిన పడ్డారు మంచు మనోజ్. టాలీవుడ్ లో ఈ మధ్యలో సెలెబ్రిటీలు ఎవరూ కోవిడ్ బారిన పడలేదు. కానీ ఇప్పుడు మనోజ్ కి కరోనా పాజిటివ్ రావడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…