Roja : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజురోజుకీ హాట్‌టాపిక్‌గా మారుతోంది. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సినీనటులు కోరుతుండగా.. ప్రజల సంక్షేమం కోసమే ఈవిధంగా రేట్లు పెట్టామని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా పలు వ్యాఖ్యలు చేస్తూ పనిలోపనిగా హీరో నానిపై కూడా విరుచుకుపడింది.
టిక్కెట్ల ధరలను తగ్గించటం అంటే ప్రేక్షకులను అవమానించటమేనని నాని చెబుతూ.. సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. దీని పైన ఇప్పటికే మంత్రులు అనిల్.. బొత్సా.. పేర్ని నాని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో నాని తన వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. వాటిని ప్రజెంట్ చేసిన విధానం వేరని చెప్పుకొచ్చారు.
తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై సినీ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు. ఇలాంటి వాఖ్యలు రెచ్చగొట్టడమే అవుతుందని రోజా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని ఆమె అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…