Manchu Manoj : మా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్‌ల మధ్య మాటల పోరు జరుగుతున్న నేపథ్యంలో.. మంచు ఫ్యామిలీకి చెందిన హీరో పవన్ కల్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఆయనను గురువారం మంచు మనోజ్ కలిశారు.
షూటింగ్ లొకేషన్‌లో పవన్ ను కలిసిన మనోజ్ కాసేపు ఆయనతో మాట్లాడారు. తరువాత మనోజ్ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసినందుకు సంతోషంగా ఉంది, ఆయన దయ, ప్రేమ చూపిస్తారు.. లవ్ యూ మచ్, జై హింద్.. అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
అయితే గురువారం మధ్యాహ్నం మోహన్ బాబు, మంచు విష్ణులు బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. మా ఎన్నికల్లో తన కుమారుడు విష్ణుకు మద్దతు తెలిపినందుకు గాను బాలకృష్ణకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఒకే రోజు ఇలా మంచు ఫ్యామిలీ సభ్యులు ఇద్దరు వేర్వేరు అగ్ర హీరోలను కలవడం, అందులోనూ మా ఎన్నికల వివాదాలు జరుగుతున్నప్పుడు ఇలా వారు ఆ హీరోలను కలవడం.. ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపేందుకు వారు ఆయనను కలిశారని చెప్పారు. మరి మనోజ్ పవన్‌ను ఎందుకు కలిశాడన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ఇక మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే మూవీతో మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…