Aryan Khan : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడం మరింత ఆలస్యం కానుంది. గురువారం ముంబై సెషన్స్ కోర్టులో ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయి. దీంతో కోర్టు అక్టోబర్ 20వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ మరో 6 రోజుల పాటు జైలులో ఉండనున్నాడు.
కాగా కోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) తరఫున తన వాదనలను వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్యన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ ను తీసుకుంటున్నాడని.. ప్రస్తుతం కేసు విచారణ ప్రాథమిక దర్యాప్తులోనే ఉందని, కనుక ఆర్యన్ ఖాన్‌కు ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని.. అన్నారు.
ఇక ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసినప్పుడు అతని వద్ద డ్రగ్స్ ఏమీ లేవని అన్నారు. ఎన్‌సీబీ కేవలం వాట్సాప్ చాట్‌ల మీద ఆధారపడి ఆర్యన్‌ఖాన్‌ను దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక కోర్టు బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు గడువు విధించడంతో ఆర్యన్ ఖాన్ ఇంకొన్ని రోజుల పాటు జైలులోనే ఉండనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…