Manchu Vishnu Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక.. వివాదాలు తగ్గుతాయనుకుంటే.. ఇంకా పెరిగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు అటు నరేష్, ఇటు ప్రకాష్ రాజ్‌లు దూషణల పర్వం మొదలు పెట్టారు. దీంతో చిలికి చిలికి ఈ వివాదం గాలి వానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే గురువారం ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మా ఎన్నికల్లో తమ కుమారుడు మంచు విష్ణుకు మద్దతు తెలిపినందుకు గాను ధన్యవాదాలు చెబుతూ బాలకృష్ణను మోహన్‌బాబు కలిశారు. అయితే అదే సమయంలో.. అటు వైపు.. మంచు మనోజ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ భీమ్లా నాయక్ షూటింగ్‌లో ఉన్నారు. దీంతో ఆయనను షూటింగ్ లొకేషన్‌లోనే మనోజ్ కలిశారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ? అనేది సస్పెన్స్‌గానే ఉంది. కానీ బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తోంది.
ఎన్నికల రోజు మనోజ్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన పవన్‌తో కాసేపు సరదాగా గడిపారు. వారి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంది. దీంతో పవన్‌కు చెప్పి వివాదం లేకుండా సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించేందుకు మంచు ప్యానెల్ మనోజ్‌ను పంపించిందని అనుకోవచ్చు. పవన్ నచ్చజెబితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నాగబాబు ఇప్పటికే దురుసుగా మాట్లాడి మరింత దూరం పెంచారు. కానీ పవన్ మాట్లాడితే ప్రకాష్ రాజ్ వింటారు కనుక.. అటు నుంచి నరుక్కు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పవన్‌ను మనోజ్ సరదాగా కలిస్తే ఓకే. కానీ మా వివాదాన్ని సద్దుమణిగించేందుకు కలసి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో వివాదాలకు బదులుగా ఆత్మీయ పలకరింపులను మనం చూడవచ్చు. మరి మా లో నెలకొన్న వివాదాలు మరికొద్ది రోజుల్లో సమసిపోతాయా ? లేదా ? అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…