Bandla Ganesh : నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడూ ఏవో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈసారి ఆయన రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం విశేషం. రాజకీయాల్లో తన రీ ఎంట్రీపై ఆయన ఈసారి స్పష్టతను ఇచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాద్‌నగర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి బండ్ల గణేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి.. బండ్ల గణేష్‌ను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు బండ్ల గణేష్ స్పందించారు.
రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి తెలంగాణ కాంగ్రెస్‌కు సేవలు అందించాలని మల్లు రవి కోరగా.. అందుకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను తప్పక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశారు. అయితే రేవంత్ ఆహ్వానించినా.. బండ్ల వస్తారా, రారా.. అన్నది సందేహమే. తన రాకను ఎవరో అడ్డుకుంటారని బండ్లకు నమ్మకం. అందుకనే కాబోలు.. అప్పట్లో బండ్ల గణేష్ రాజకీయాల్లో నుంచి అనూహ్యంగా తప్పుకున్నారు. అందుకు అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం అని చెప్పవచ్చు.
అయితే బండ్ల గణేష్ కాంగ్రెస్‌లో తిరిగి చేరి సేవలు అందిస్తే ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కుతుందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చాక కాంగ్రెస్ పార్టీలో కొంత జోరు పెరిగింది. మరి ఎన్నికల వరకు ఆ జోరు ఉంటుందా, లేదా అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…