Karthikeya Wedding : ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఎట్టకేలకు ఒక ఇంటి వాడయ్యాడు. ఆదివారం హైదరాబాద్‌లో కార్తికేయ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తన కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్‌పూత్ పెళ్లిలో సందడి చేశారు.
ఈ పెళ్లి వేడుకకు పాయల్ రాజ్ పూత్ తన ప్రియుడు సౌరబ్ దింగ్రాతో హాజరైంది. అలాగే సాయికుమార్, దర్శకుడు అజయ్ భూపతి, సుధాకర్ కోమాకుల, రోహిత్, తనికెళ్ల భరణిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్తికేయ తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 9.47 గంటలకు కార్తికేయ, లోహితల వివాహం జరిగింది.
కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ.. లోహితకు ప్రపోజ్ చేశాడు. తనను అభిమానులకు పరిచయం చేశాడు. 2010లో లోహితను అతను మొదటి సారిగా కలుసుకున్నాడు. వరంగల్ నిట్‌లో చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ నిన్న మొన్నటి వరకు వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియదు. హీరోగా సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానన్న కార్తికేయ.. అలా జరగ్గానే తన ప్రేమ విషయం చెప్పి ఇరు కుటుంబాలకు చెందిన వారిని ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు.
కార్తికేయ ఆర్ఎక్స్ 100 తో బంపర్ హిట్ అందుకున్నాడు. తరువాత హిప్పి, గుణ 369, 90 ఎంఎల్, చావు కబురు చల్లగా వంటి చిత్రాలు చేశాడు. నాని గ్యాంగ్ లీడర్ మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న వాలిమై చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
కాగా కార్తికేయ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…