Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే మాస్ హీరోగా ఎంతో గుర్తింపు పొందాడు. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్ సినిమాలే ఉన్నాయి. రొమాంటిక్ జోనర్‌లో చేసిన సినిమాలు తక్కువ. ఇక తాజాగా ఆయన పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ అనే రొమాంటిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో సందడి చేయనున్నారు. ఇది ఓ గొప్ప ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ మూవీకి చెందిన టీజర్ యూట్యూబ్‌లో 60 గంటలకు పైగా ట్రెండింగ్‌లో ఉండి రికార్డు సృష్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యం కాని రికార్డులను రాధే శ్యామ్ తిరగ రాసింది.
కాగా రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ భవిష్యత్‌ను చెప్పే విక్రమాదిత్యగా నటిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఎవరో.. వీరెవరో అంటూ సాగే ఈ పాటకు ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
కాగా యూట్యూబ్ లో ఈ పాట సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ లను సొంతం చేసుకుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…