కన్న బిడ్డలను పెంచి పెద్ద చేసి ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సిన తల్లిదండ్రులు బాధ్యత మరిచి కన్నబిడ్డనే పెళ్లి చేసుకుంటాననే విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విచిత్ర సంఘటన న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది. తన బిడ్డను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు అనుమతి ఇవ్వండి అంటూ పేరెంట్ మాన్హాటన్ ఫెడరల్ కోర్ట్ లో పిటీషన్ వేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఎంతో ఆశ్చర్యానికి గురైంది. ఈ పిటిషన్ వేసినది తల్లా లేక తండ్రా అనే విషయం వెల్లడించలేదు. అదేవిధంగా ఈ పిటిషన్ లో వారు నివసిస్తున్న ప్రాంతం కూడా తెలియజేయలేదు. ఈ విధంగా కన్నబిడ్డను వివాహం చేసుకోవడం లైంగిక జీవితం కోసమా? మరే ఇతర కారణాలు ఉన్నాయ అనే విషయం తెలియలేదు.
పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అందులో తన బిడ్డకు ప్రొపోజ్ చేయాలని భావించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ విషయాన్ని మానసిక హాని కలిగిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ విధమైన పిటిషన్ ఆమోదిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు అందించినట్లు అని పలువురు ఈ పిటిషన్ పై వ్యతిరేకత చూపిస్తున్నారు. అయినప్పటికీ ఈ విధంగా కన్నబిడ్డనే వివాహం చేసుకోవాలనుకోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన అని చెప్పవచ్చు.