Holy Basil Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే తులసి మొక్కను ఉపయోగిస్తున్నారు. హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మహిళలు రోజూ తులసి కోటకు పూజలు చేస్తుంటారు. తులసి వరాలను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. అయితే ఆయుర్వేదంలోనూ తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీని ద్వారా అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా తులసి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు కలిగే అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే 4 తులసి ఆకులను నమిలి తింటే.. ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రోజూ తులసి ఆకులను తింటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఫంగస్, వైరస్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వికారం, జ్వరం, స్త్రీలలో రుతు సమస్యలు తగ్గుతాయి. వరుసగా ఒక వారం రోజుల పాటు తింటే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక షుగర్ ఉన్నవారికి కూడా తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
తులసి ఆకులను రోజూ తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. తులసి ఆకులను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. దీంతోపాటు నొప్పి కూడా తగ్గుతుంది. మూత్రాశయ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తులసి ఆకులను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి. తులసి ఆకులను నములుతుంటే ఎంతటి జ్వరం అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. అలాగే సీజనల్ వ్యాధులు తగ్గుతాయి.
తులసి ఆకులలో చర్మానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే మొటిమలు, చర్మంపై దురద, ముడతలు తగ్గిపోతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. దీంతో ముడతలు పడకుండా ఉంటుంది. వయస్సు మీద పడినా ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అలాగే తులసి ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే కంటి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఇలా తులసి ఆకులను రోజూ పరగడుపునే తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కాబట్టి వీటిని తీసుకోవడం మరిచిపోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…