Ravi Teja : సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే మాత్రం అది ఫ్లాప్ అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. అయితే రవితేజతో కాజల్ అగర్వాల్‌కి అస్సలు కలిసి రాలేదు. తెలుగులో కాజల్ అగర్వాల్ కు పేరుంది. కాజల్ అగర్వాల్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరు కావడంతో పాటు పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు కాజల్ ను ఆమెను లక్కీ హీరోయిన్ గా భావిస్తారు. ప్రభాస్, తారక్, చరణ్ లతో కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్స్ కొట్టాయి. దీంతో ఈ హీరోలు కాజల్ ను లక్కీ హీరోయిన్ గా భావిస్తారు. కాని రవితేజతో సినిమాలు చేసిన కాజల్ ఒకానొక సందర్భంలో సందిగ్ధంలో పడింది.
రవితేజ, కాజల్ కాంబినేషన్ లో వీర, సారొచ్చారు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన అపజయాన్ని సొంతం చేసుకున్నాయి. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కి 2011 సంవత్సరంలో విడుదలైన వీర అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కగా, శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాలో రవితేజ చెల్లి పాత్రలో నటించారు. ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత సారొచ్చారు సినిమాలో రవితేజ, కాజల్ కలిసి నటించారు. పరశురామ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా నిరాశపరచింది.
సారొచ్చారు సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. రవితేజ కాజల్ కాంబినేషన్ ఫ్లాప్ కాంబినేషన్ కాగా , కాజల్‌కి రవితేజతో సినిమిలు చేయడం వలన కెరీర్‌కి కొంత నష్టం జరిగింది. ఇద్దరి కాంబినేషన్‌లో హిట్స్ పడకపోవడం వలన ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమాలు వస్తాయో రావో చూడాలి. రవితేజ తాప్సీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…