Getup Srinu : 3 రోజుల‌కు రూ.50 వేలు అడిగాడు.. అస‌లు విష‌యం చెప్పిన గెట‌ప్ శ్రీ‌ను..

Getup Srinu : సెన్సేషనల్  డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. ఇప్పటికే ఈ చిత్రం అన్ని పనుల‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్, అలీ, విష్ణు రెడ్డి, గెటప్ శ్రీను వంటివారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల ఆగస్టు 25న లైగర్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లైగర్ చిత్ర ప్రమోషన్స్ భాగంగా వరంగల్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో గెటప్ శ్రీను కామెడీతో అందర్నీ ఆకర్షించాడు. పైసా వసూల్ చిత్రంలో బాలయ్య చెప్పిన తేడా.. తేడా సింగ్.. బాల్కనీ రెండు టికెట్లు డైలాగ్ ను గెటప్ శ్రీను మిమిక్రీ చేసి చూపించాడు. అంతే కాకుండా ఈ డైలాగ్‌ను విజయ్ దేవరకొండ చెప్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేసి చూపించి అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు గెటప్ శ్రీను.

Getup Srinu

అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను అందరికీ తెలియజేశాడు. ఈ చిత్రంలో గెటప్ శ్రీను విజయ్ దేవరకొండ స్నేహితుడిగా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం విజయ్ బ్యాంకాక్ వెళ్లి చాలా కష్టపడ్డాడు. విజయ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాను కదా నేను కూడా ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో జిత్ క్వాండో నేర్చుకుందామని ట్రైనర్ ని పిలిపించుకున్నాను. అతడు మూడు రోజుల‌ ట్రైనింగ్ కు రూ.50వేలు ఫీజు అడిగాడు. మన రేంజ్ అది కాదని చెప్పి వెంటనే అతనిని పంపించేశాను. ఇలా గెటప్ శ్రీను త‌న‌కు ఎదురైన సంఘటనలను ఈవెంట్ లో అందరి ముందు చెప్పుకొచ్చాడు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM