The Legend : అరుళ్ శరవణన్ ది లెజెండ్ మూవీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నిటి మీద ట్రోలింగ్ చేశారు. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు. ఎట్టకేలకు ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది.
ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్ లుక్స్ గురించి, 51 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ.. రూ.80 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడేంటీ.. ఇతను ఏమైనా పిచ్చోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సినిమాపై నెగెటివిటీ ఉన్నప్పటికీ కొంతవరకు జనాలు ఈ మూవీని చూడడానికి వెళ్లారు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ఒకసారి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే..
ది లెజెండ్ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.82 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా వరకు అడ్వాన్స్ బేసిస్ మీదే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి పెట్టిన రూ.80 కోట్ల బడ్జెట్ రికవరీ చేయాల్సి ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత జరిగింది అనే వివరాలు బయటకు రాలేదు.
తమిళనాడులో అయితే శరవణన్ స్టోర్స్ లో షాపింగ్ చేసిన జనాలకు ది లెజెండ్ టికెట్లు, స్నాక్స్ కూపన్స్ తో తక్కువ రేట్లకు బహుమతిగా ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా ఇంకా10 శాతం కూడా రికవరీ సాధించలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలు పక్కన పెడితే.. ఈ మూవీ రూ.70 కోట్ల నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…