Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ ప్యాన్ ఇండియా సినిమా లైగర్. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 25న భారీ ఎత్తున ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాయి.
ఇక హీరో విజయ్ దేవరకొండతోపాటు నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మిలు కూడా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేశమంతా తిరుగుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఆగస్టు 14న వరంగల్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇదే వేదికపై దర్శకుడు పూరీ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూరీ జగన్నాథ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ముందుగా సహ నిర్మాత కరణ్ జోహార్ కి, ఇంకా హీరో విజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తరువాత తన భార్య చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆమె తనకి విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా చూడమని చెప్పగా తాను ఆ సినిమా చూశానని, ఒక 45 నిమిషాల పాటు సినిమా చూడగానే విజయ్ నటనతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. ఆయన ఒక అరుదైన నటుడని, తాను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పగానే రూ.2 కోట్లు అయనా సరే తిరిగి ఇచ్చేయగలడని తెలిపారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే పోషించిన పాత్ర కూడా చాలా బలమైనదని చెబుతూ.. మరో ముఖ్య పాత్రలో నటించిన మైక్ టైసన్ గురించి మాట్లాడారు. మొదట తన మూవీలో మైక్ టైసన్ నటించనున్నారని చెప్పినప్పుడు తనని ఎవరూ నమ్మలేదని అన్నారు. ఆయన వేసుకునే చెప్పుల సైజు నంబరు 20 ఉంటుందని, తనది భారీ కాయం అని, తనకి కూడా మైక్ టైసన్ ని సెట్ లో చూడగానే మొదట భయం వేసిందని చెప్పుకొచ్చారు.
తరువాత ఆయన చార్మి గురించి మాట్లాడుతూ ఆమె షూటింగ్ లో ఏ సమస్య వచ్చినా తన దాకా రానివ్వదని తనే సొంతంగా అన్నీ హ్యాండిల్ చేసుకోగలదని అన్నారు. దుఃఖంలో కూడా ఒంటరిగానే ఉంటుందని, తన వల్లే చిత్ర షూటింగ్ ప్రశాంతంగా చేసుకోగలిగామని, కాబట్టి ఐ లవ్ యూ చార్మి.. అని వాఖ్యానించారు. ఇంకా విజయ్ తల్లిగా రమ్యకృష్ణ పోషించిన పాత్రలో రెబల్ లక్షణాలు ఉంటాయని, ఆ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
పూరీ కనెక్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా హిందీలో ధర్మా ప్రొడక్షన్స్ సహకారంతో ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…