Getup Srinu : సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. ఇప్పటికే ఈ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్, అలీ, విష్ణు రెడ్డి, గెటప్ శ్రీను వంటివారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల ఆగస్టు 25న లైగర్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లైగర్ చిత్ర ప్రమోషన్స్ భాగంగా వరంగల్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో గెటప్ శ్రీను కామెడీతో అందర్నీ ఆకర్షించాడు. పైసా వసూల్ చిత్రంలో బాలయ్య చెప్పిన తేడా.. తేడా సింగ్.. బాల్కనీ రెండు టికెట్లు డైలాగ్ ను గెటప్ శ్రీను మిమిక్రీ చేసి చూపించాడు. అంతే కాకుండా ఈ డైలాగ్‌ను విజయ్ దేవరకొండ చెప్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేసి చూపించి అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు గెటప్ శ్రీను.

అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను అందరికీ తెలియజేశాడు. ఈ చిత్రంలో గెటప్ శ్రీను విజయ్ దేవరకొండ స్నేహితుడిగా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం విజయ్ బ్యాంకాక్ వెళ్లి చాలా కష్టపడ్డాడు. విజయ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాను కదా నేను కూడా ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో జిత్ క్వాండో నేర్చుకుందామని ట్రైనర్ ని పిలిపించుకున్నాను. అతడు మూడు రోజుల ట్రైనింగ్ కు రూ.50వేలు ఫీజు అడిగాడు. మన రేంజ్ అది కాదని చెప్పి వెంటనే అతనిని పంపించేశాను. ఇలా గెటప్ శ్రీను తనకు ఎదురైన సంఘటనలను ఈవెంట్ లో అందరి ముందు చెప్పుకొచ్చాడు.