Ganesh Murugan : వీల్‌ చెయిర్‌లోనే ఫుడ్ డెలివరీ.. ఈ వ్యక్తి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

Ganesh Murugan : మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది అనేక రకాల మనస్తత్వాలతో ఉంటారు. కొందరు తాము చేస్తున్న పని నచ్చడం లేదని చెబుతుంటారు. ఇక కొందరు తమకు నచ్చిన పని దొరకడం లేదని ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కొందరు జులాయిగా తిరుగుతూ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేస్తుంటారు. ఇలా అనేక రకాల వ్యక్తులు మనకు తారస పడుతుంటారు. అయితే ఇలాంటి వారందరికీ అతను ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రమాదం కారణంగా కాళ్లు పనిచేయకపోయినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. తనకు దొరికిన పని చేస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

చెన్నైకి చెందిన గణేష్‌ మురుగన్‌ వయస్సు 37 ఏళ్లు. అతను జొమాటోలో ఫుడ్‌ డెలివరీ చేస్తూ కాలం వెళ్లదీస్తుండేవాడు. అయితే ఒకసారి ట్రక్కు ఢీకొని అతని వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో కింది భాగం మొత్తం పనిచేయకుండా పోయింది. అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేకపోయాడు. ఇది 6 ఏళ్ల కిందట జరిగింది.

అయితే అంతటి ప్రమాదం బారిన పడి నడవరాకుండా అయిపోయినా.. అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టపడి పనిచేసేందుకు నడుం బిగించాడు. అందులో భాగంగానే ఐఐటీ మద్రాస్‌ వారి సహకారంతో ఒక వీల్‌ చెయిర్‌ను తీసుకుని దాంతో ఫుడ్‌ డెలివరీలు చేయడం మొదలు పెట్టాడు. ఆ వీల్‌ చెయిర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లా పనిచేస్తుంది. అందులో బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 25 కిలోమీటర్లు వెళ్లవచ్చు.

ఇలా గణేష్‌ తాను వైకల్యం బారిన పడ్డాననే బాధ లేకుండా తన కాళ్లపై తాను నిలబడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా మంది నచ్చిన పని దొరకడం లేదని సమయాన్ని, వయస్సును వృథా చేసుకుంటుంటారు. అలాగే కొందరు జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. అలాంటి వారందరికీ గణేష్‌ ప్రేరణగా నిలుస్తున్నాడు. కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలే కానీ ఏ పని అయినా చేయవచ్చని.. అందుకు శరీర వైకల్యం కూడా అడ్డుకాదని అతను నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని స్టోరీ తెలిసిన వారు కన్నీళ్లు పెడుతున్నారు. అతన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లు అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే అతని స్టోరీ వైరల్‌ అవుతోంది.

Share
Shiva P

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM