Chinmayi : ప్రస్తుత తరుణంలో చాలా మంది హీరోయిన్లు ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రోజూ వారు పెట్టే పోస్టులకు గాను వారు ట్రోల్స్‌కు గురవుతుంటారు. ఇక కొన్ని పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. దీంతో వారిపై భారీ ఎత్తున విమర్శలు వస్తుంటాయి. అయితే కొందరు మాత్రం ఏమీ చేయకపోయినా వారిపై ట్రోల్స్, విమర్శలు నిరంతరం వస్తూనే ఉంటాయి. అలాంటి నటుల్లో చిన్మయి ఒకరు. ఈమె సింగర్‌గానే కాక నటిగా కూడా రాణిస్తోంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అయితే సింగర్ చిన్మయికి ఊహించని షాక్ తగిలింది. ఆమె అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సింగర్ చిన్మయి తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు తమ నగ్న ఫొటోలను పంపిస్తున్నారని.. ఎంతో కాలంగా ఇది జరుగుతుందని.. అయితే దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేశానని చెప్పింది. కానీ ఇన్‌స్టాగ్రామ్ వారు మాత్రం ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన, బాధితురాలు అయిన తనపైనే చర్యలు తీసుకుందని.. తన అకౌంట్‌ను తొలగించారని చెప్పింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇంకో బ్యాకప్ అకౌంట్‌ను క్రియేట్ చేయడం జరిగిందని.. కనుక ఇకపై తనను ఆ అకౌంట్‌లో ఫాలో కావాలని కోరింది.
వాస్తవానికి చిన్మయికి ఎప్పుడూ ఇలాంటి ఏదో ఒక చేదు సంఘటన ఎదురవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై ఆమె పోరాటం చేస్తుంటుంది. దానికి సంబంధించి ఆమె పోస్టులు పెడుతుంటుంది. ఇక ఇటీవలే చిన్మయికి కవలలు జన్మించారు. ఈ క్రమంలోనే వారి చేతులు పట్టుకున్నట్లుగా ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…