Vignesh Shivan : స్టార్ కపుల్ విగ్నేష్ శివన్, నయనతార ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. జూన్ 9వ తేదీన వీరి వివాహం మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్‌లో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరి వివాహ వేడుకకు షారూఖ్ ఖాన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం వీరు హనీమూన్ కోసం థాయ్ లాండ్ వెళ్లారు. అక్కడ తాము తీసుకున్న ఫొటోలను వీరు ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు.
ఇక నయనతార ఎంతో కాలం నుంచి లేడీ సూపర్ స్టార్‌గా కొనసాగుతుండగా.. అటు విగ్నేష్ శివన్ కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరి ఆస్తుల విలువ గురించి బాలీవుడ్ మీడియా అనేక కథనాలను ప్రచురిస్తోంది. ఆ కథనాల ప్రకారం.. విగ్నేష్ శివన్, నయనతారల ఉమ్మడి ఆస్తి విలువ రూ.270 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
నయనతార హీరోయిన్‌గా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. కనుక సహజంగానే ఆమె సంపద ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే నయనతారకు ఆస్తులు భారీగానే ఉన్నట్లు సమాచారం. ఈమెకు ఒక ప్రైవేట్ జెట్‌తోపాటు పలు బీఎండబ్ల్యూ కార్లు, మెర్సిడిస్ బెంజ్ కార్లు ఉన్నాయట. అఆగే చెన్నైలో పలు కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె ఆస్తి విలువే రూ.170 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇక దర్శకుడు విగ్నేష్ శివన్ ఆస్తి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. విగ్నేష్ శివన్.. నయనతారలా అంత పాపులర్ కాదు. కానీ ఆస్తి మాత్రం బాగానే ఉందట. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి ఆస్తి కలిపి రూ.270 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక నయనతార ప్రస్తుతం బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ మూవీ జవాన్‌లో నటిస్తోంది. దీనికి తమిళ దర్శకుడు అట్లీ దర్వకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఆమె ఈ షూటింగ్‌లో పాల్గొననుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…