మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

మ‌న చుట్టూ ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలియ‌క మ‌నం వాటిని స‌రిగ్గా ఉప‌యోగించుకోలేకపోతున్నాం. మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌ల్లో గ‌డ్డి చామంతి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. గ‌డ్డి చామంతి మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ప్ర‌స్ఫుట‌పు మొన దేలిన అంచుల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క శాస్త్రీయ‌నామం ట్రైడాక్స్ ప్రొకంబ‌న్స్. దీనిని ఆంగ్లంలో మెక్సిక‌న్ డైసీ అని, సంస్కృతంలో జ‌యంతివేద అని పిలుస్తారు.

అలాగే మ‌న ద‌గ్గర‌ కూడా దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర‌కంగా పిలుస్తారు. గ‌డ్డి చామంతి మొక్క‌కు గాయ‌పాకు, వైశాల‌క‌ర్ణి, రావ‌ణాసుర త‌ల వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను అనేక ర‌కాల అఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. గ‌డ్డి చామంతి మొక్క‌లో ఆల్క‌లాయిడ్లు, ఫ్లేవ‌నాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి వాటితోపాటు సోడియం, పొటాషియం, కాల్షియం వంటి మిన‌ర‌ల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.

ఈ మొక్క ఆకులు యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. గాయాలు త‌గిలిన‌ప్పుడు, తెగిన‌ప్పుడు ఈ మొక్క ఆకుల నుండి తీసిన ర‌సాన్ని రాయ‌డం వ‌ల్ల ర‌క్తం కార‌డం ఆగ‌డ‌మే కాకుండా గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని ఉప‌యోగించి ద‌గ్గు, జ‌లుబు, ఆయాసం వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. జుట్టు రాల‌డం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు గ‌డ్డి చామంతి మొక్క ఆకుల ర‌సం, గుంట‌గ‌లగ‌రాకు మొక్క ఆకుల ర‌సం, నువ్వుల నూనెను స‌మ‌పాళ్లలో తీసుకుని చిన్న మంట‌పై కేవలం నూనె మిగిలే వ‌ర‌కు మ‌రిగించాలి. ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను త‌ల‌కు ప‌ట్టించి గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం స‌మ‌స్య త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గ‌డ్డి చామంతి మొక్క‌కు షుగ‌ర్ ను నియంత్రించే గుణం కూడా ఉంటుంది. ఇందులో ఉండే జోలియో లోనిక్ అనే ర‌సాయ‌నం కార‌ణంగా షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మ వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారు ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేప‌నంగా రాయ‌డం వల్ల చ‌ర్మ స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ మొక్క ఎండిన ఆకుల‌తో పొగ‌ను వేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే దోమ‌లు పారిపోతాయి. ఈ విధంగా గ‌డ్డి చామంతి మొక్క మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. దీనిని త‌గిన విధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని.. నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM