హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా తన శరీరాన్ని ఒక మహిళకు చూపుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో కాల్ రికార్డింగ్ లీక్ అవడం వల్ల వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ, ప్రింట్ మీడియాలోనూ ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీని వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో సదరు ఎంపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధవ్ ఆ వీడియో కాల్ ద్వారా ఏ మహిళని లైంగిక వేధింపులకు గురి చేయలేదని, ఒకవేళ చేస్తే ఎవరైనా తన మీద కంప్లైంట్ చేశారా.. అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రైవేటుగా ఆ వీడియోలో ఉన్నట్టుగా చేసుకోవడంలో తప్పేముందని అన్నారు. అయితే ఆయన చేసిన ఈ వాఖ్యలు.. వివాదం మొదలైన రోజు పార్టీ చెప్పినట్టుగా.. ఆ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన దానికి విరుద్దంగా ఉన్నాయి. దీంతో ఎంపీ మాధవ్ పై పార్టీ ఇక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
కాగా ఎంపీ మాధవ్ కి ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ఈయన అనంతపురం జిల్లాలో కదిరి సీఐగా పని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ప్రజలతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడని సమాచారం. అప్పట్లో ఈయనపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైందని మీడియాలో ప్రచారం అవుతోంది. ఇక భవిష్యత్తులో పార్టీ ఏం చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…