రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టారు యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంటుంది సుమ. కెరీర్ ఆరంభంలో మాత్రం సుమ ఫేమ్ అవ్వడానికి చాలా కష్టపడిందనే చెప్పొచ్చు. అయితే సుమ ఎప్పుడైతే రాజీవ్ ను పెళ్ళి చేసుకుందో అప్పటి నుంచి సుమ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
కనకాల కుటుంబంలోకి సుమ వచ్చాక.. వెండితెర కు దూరంగా ఉండి బుల్లితెరపైనే ఫోకస్ పెట్టేసింది. అయితే సుమ పెళ్లి 1999లో జరిగిందన్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చాయి. సుమ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ కొత్త వీడియోను అప్‌లోడ్ చేసింది. అందులో తన వరలక్ష్మీ వ్రతం చీర, తన తల్లి 80వ బర్త్ డేకు సంబంధించిన చీర షాపింగ్ గురించి ఉంది.
ఆ వీడియోలో సుమ.. షింఘానియా అనే షాపింగ్ మాల్ ప్రాముఖ్యత, విశిష్టతను వివరించింది. అందులో పది వేల నుంచి పది లక్షల ఖరీదైన చీరలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. పదిహేను వేల రేంజులో చూపించు అని సరదాగా అంటే.. మీ రేంజ్ ఇది కాదు మేడం.. అంతా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయని సేల్స్ మేనేజర్ అంటాడు. నాది ఇదే రేంజ్ అండి.. అని సుమ సరదాగా అంటుంది.
ఇక ఓ పెళ్లీ చీరను చూపించి.. దీని రేటు రెండు లక్షలు అని చెబుతాడు. వామ్మో అనుకుంటూ.. రాజా మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా ? రెండు లక్షలా.. మా పెళ్లి చీర రూ.11 వేలే.. అంతే పెట్టాం.. అలా అని మేం ఎప్పుడో పెళ్లి చేసుకోలేదండి.. ఈ మధ్యే చేసుకున్నామని కౌంటర్లు వేసింది సుమ. అలా సుమ తన పెళ్లి చీర విశేషాలు బయటకు వచ్చాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…