Dates and Almond benefits : ఖర్జూరం మరియు బాదం రెండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Dates and Almond Benefits : ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఖర్జూరం అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారలలో ఒకటి. శరీరానికి కావలిసిన శక్తినివ్వటానికి, శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం శరీరానికి అందిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ ఎ ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు.

ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పేస్ట్ లా చేసి పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు సమస్య తగ్గుముఖం పడుతుంది.  ఖర్జూరాల్లోని మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మహిళలు  గర్భధారణ సమయంలో ఖర్జూరాలను తీసుకుంటే ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.

అంతేకాకుండా ఖర్జూరాలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో ఉండే బోరాన్ అనే స‌మ్మేళ‌నంతోపాటు ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి. దీనివ‌ల్ల ఎముక‌లు గుల్ల‌గా మారిపోయే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఖ‌ర్జూరాల‌లో విట‌మిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో సెరొటోనిన్‌, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్ల‌ను విడుదల చేస్తుంది. రోజుకి రెండు ఖర్జూరాలను తినడం ద్వారా ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు తగ్గుతాయి. అంతే కాకుండా మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

ఖర్జూర పండ్లలోని పొటాషియం గుండెకు రక్తాన్ని సక్రమంగా అందేలా చేస్తుంది. రక్తపోటులో హెచ్చు తగ్గులను నియంత్రించేందుకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాల్లోని ఐరన్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచి  రక్తహీనతను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూకు రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించడంతో పాటు బలం చేకూరుతుంది.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM