ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసిఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా స్టడీ రన్ ని చూపిస్తూ అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది. 5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా సోమవారం రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మళ్ళీ మంగళవారం రోజు కూడా ఈ సినిమా అదే రేంజ్ వసూళ్లను రాబట్టి స్థిరమైన వసూళ్లను రాబడుతున్న సినిమాగా నిలిచింది.
ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.. ప్రాంతం షేర్ కలెక్షన్స్: నైజం 11.77 కోట్లు, సీడెడ్ 9.00 కోట్లు, ఉత్తరాంధ్ర 5.36 కోట్లు, ఈస్ట్ 3.40 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, నెల్లూరు 1.90 కోట్లు, గుంటూరు 4.00 కోట్లు, కృష్ణ 2.50 కోట్లు మొత్తం 40.00 కోట్లు. ఓవర్సీస్ 4.60 కోట్లు, కర్ణాటక 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.60 కోట్లు, వరల్డ్ వైడ్ 54.70 కోట్లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది. కేవలం నైజం మరియు ఓవర్సీస్ లో మాత్రమే అడ్వాన్స్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, మిగిలిన చోట్ల కమిషన్ బేసిస్ మీదనే బిజినెస్ ని జరుపుకుంది.
అంటే వచ్చే గ్రాస్ లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ కి పోతే మిగిలిన 50 శాతం నిర్మాతకి వెళ్తుంది. ఆ లెక్కన ఈ సినిమా నిర్మాతలకు మరియు బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమానే. గాడ్ ఫాదర్ విషయంలో ఓపెనింగ్స్ దగ్గరే సమస్య వచ్చింది. టికెట్ రేట్స్ ఎక్కువగా లేకపోవడంతో పాటుగా లిమిటెడ్ రిలీజ్ కూడా ఉండడం మైనస్ గా మారింది. దసరా రోజు గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ స్వాతి ముత్యాలు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ 2 సినిమాలు చిరంజీవి సినిమాతో పోటీ పడే స్థాయి లేకపోయినప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థల నుండి వచ్చిన సినిమాలు కావడంతో థియేటర్స్ ని బాగా హోల్డ్ చేసారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…