Koratala Siva : కొరటాల శివ‌పై చిరంజీవి ఇన్‌డైరెక్ట్ సెటైర్‌.. ద‌ర్శ‌కుల‌కు పాఠాలు చెబుతున్న మెగాస్టార్‌..

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి స‌హ‌జంగానే ఎలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌రు. ఆయ‌న వివాదాల‌కు దూరంగా ఉంటారు. కానీ తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మాత్రం వివాదాస్ప‌దంగానే ఉన్నాయి. టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను ఉద్దేశించి ఆయ‌న కాస్త క‌ఠినంగానే మాట్లాడారు. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అమీర్‌ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా మూవీ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు పాఠాలు చెప్పారు.

బాలీవుడ్‌లో భిన్న‌మైన సంప్ర‌దాయం ఉంటుంద‌ని చిరంజీవి అన్నారు. అక్క‌డ స్క్రిప్ట్‌, డైలాగ్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటార‌ని.. వాటిని ముందుగానే న‌టీన‌టుల‌కు ఇస్తార‌ని.. దీంతో వారు ప్రాక్టీస్ చేసి షూటింగ్ కు వ‌చ్చి అక్క‌డ చాలా అద్భుతంగా న‌టిస్తార‌ని అన్నారు. అయితే టాలీవుడ్‌లో ఇందుకు భిన్నంగా ఉన్నార‌ని అన్నారు. షూటింగ్ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కులు డైలాగ్స్ రాస్తార‌ని.. క‌నుక అప్ప‌టిక‌ప్పుడు ఆ డైలాగ్స్‌ను గుర్తు పెట్టుకుని న‌టించ‌డం క‌ష్టంగా ఉంటుంద‌ని అన్నారు. దీంతో ఓ వైపు డైలాగ్స్‌పై దృష్టి పెట్టాలా.. మ‌రోవైపు యాక్టింగ్ పై ఫోక‌స్ చేయాలా.. అన్న విష‌యంపై క్లారిటీ రాద‌ని.. ఫ‌లితంటా న‌టీన‌టుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అన్నారు.

Koratala Siva

టాలీవుడ్ ద‌ర్శ‌కులు కూడా బాలీవుడ్‌ను ఫాలో కావాల‌ని చిరంజీవి సూచించారు. మూవీ షూటింగ్‌కు ఒక రోజు ముందే వ‌ర్క్‌షాప్ లాంటిది నిర్వ‌హించి డైలాగ్స్ గురించి ముందుగానే చెబితే.. న‌టీన‌టులు బాగా ప్రాక్టీస్ చేస్తార‌ని.. అలా కాకుండా షూటింగ్ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కులు డైలాగ్స్ రాస్తుండ‌డం వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. క‌నుక‌నే న‌టీన‌టులు స‌రిగ్గా యాక్ట్ చేయ‌లేక‌పోతున్నార‌ని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి త‌న వ్యాఖ్య‌ల ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా కొర‌టాల‌పైనే సెటైర్ వేశార‌ని అంటున్నారు. ఈమ‌ధ్యే విడుద‌లైన ఆయ‌న ఆచార్య మూవీ డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో చిరంజీవి బాగా డిజ‌ప్పాయింట్ అయ్యార‌ట‌. అందుక‌నే కొర‌టాల‌ను నేరుగా అన‌లేక ఇలా ఈ సంద‌ర్భాన్ని అడ్డు పెట్టుకుని చిరంజీవి ఆయ‌న‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశార‌ని అంటున్నారు. అయితే దీనికి కొర‌టాల ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM