Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి సహజంగానే ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆయన కాస్త కఠినంగానే మాట్లాడారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ దర్శకులకు పాఠాలు చెప్పారు.
బాలీవుడ్‌లో భిన్నమైన సంప్రదాయం ఉంటుందని చిరంజీవి అన్నారు. అక్కడ స్క్రిప్ట్, డైలాగ్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటారని.. వాటిని ముందుగానే నటీనటులకు ఇస్తారని.. దీంతో వారు ప్రాక్టీస్ చేసి షూటింగ్ కు వచ్చి అక్కడ చాలా అద్భుతంగా నటిస్తారని అన్నారు. అయితే టాలీవుడ్‌లో ఇందుకు భిన్నంగా ఉన్నారని అన్నారు. షూటింగ్ సమయంలోనే దర్శకులు డైలాగ్స్ రాస్తారని.. కనుక అప్పటికప్పుడు ఆ డైలాగ్స్‌ను గుర్తు పెట్టుకుని నటించడం కష్టంగా ఉంటుందని అన్నారు. దీంతో ఓ వైపు డైలాగ్స్‌పై దృష్టి పెట్టాలా.. మరోవైపు యాక్టింగ్ పై ఫోకస్ చేయాలా.. అన్న విషయంపై క్లారిటీ రాదని.. ఫలితంటా నటీనటులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

టాలీవుడ్ దర్శకులు కూడా బాలీవుడ్‌ను ఫాలో కావాలని చిరంజీవి సూచించారు. మూవీ షూటింగ్‌కు ఒక రోజు ముందే వర్క్‌షాప్ లాంటిది నిర్వహించి డైలాగ్స్ గురించి ముందుగానే చెబితే.. నటీనటులు బాగా ప్రాక్టీస్ చేస్తారని.. అలా కాకుండా షూటింగ్ సమయంలోనే దర్శకులు డైలాగ్స్ రాస్తుండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. కనుకనే నటీనటులు సరిగ్గా యాక్ట్ చేయలేకపోతున్నారని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా కొరటాలపైనే సెటైర్ వేశారని అంటున్నారు. ఈమధ్యే విడుదలైన ఆయన ఆచార్య మూవీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో చిరంజీవి బాగా డిజప్పాయింట్ అయ్యారట. అందుకనే కొరటాలను నేరుగా అనలేక ఇలా ఈ సందర్భాన్ని అడ్డు పెట్టుకుని చిరంజీవి ఆయనపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశారని అంటున్నారు. అయితే దీనికి కొరటాల ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి.