Billa Ganneru : షుగ‌ర్ వ్యాధికి అద్భుత‌మైన ఔషధం.. ఈ మొక్క.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Billa Ganneru : మ‌న చుట్టూ అనేక ర‌కాల పూల మొక్క‌లు ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు అంద‌మైన పూల‌తో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా ఉలిగి ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ను ఇంటి పెర‌ట్లో, ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వివిధ రంగుల పూలు పూసే బిళ్ల గ‌న్నేరు మొక్క‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ఈ మొక్క‌ను సంస్కృతంలో నిత్య‌క‌ళ్యాణి అని పిలుస్తారు. సంవ‌త్స‌రం పొడ‌వునా పూలు పూసే ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకులు, పూలు, వేర్ల‌ను ఉప‌యోగించి ప‌లు ర‌కాల రోగాల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. బిళ్ల‌గ‌న్నేరు మొక్క వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీరంలో ఉండే అనేక రుగ్మ‌త‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క‌ను చాలాకాలం నుండి ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌కు గాయాల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంటుంది. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని గాయాలు, పుండ్ల వంటి వాటిపై ఉంచ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఈ మొక్క పూల‌ను, దానిమ్మ పూల‌ను స‌మానంగా తీసుకుని వాటి నుండి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని రెండు చుక్క‌ల మోతాదులో ముక్కులో వేయ‌డం వ‌ల్ల ముక్కు నుండి ర‌క్తం కార‌డం ఆగుతుంది.

Billa Ganneru

బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల నుండి తీసిన ర‌సాన్ని విష కీట‌కాలు కుట్టిన చోట వేయ‌డం వల్ల కొంత‌వ‌ర‌కు విష ప్ర‌భావం త‌గ్గుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారికి బిళ్ల గ‌న్నేరు మొక్క వేరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క వేరును సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది లేదా ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపున న‌మిలి తిన్నా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను, వేప ఆకుల‌ను స‌మానంగా తీసుకుని ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని త‌గినంత‌గా తీసుకుని దానికి కొద్దిగా ప‌సుపును క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి.

ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేదా పూల ర‌సాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడితోపాటు నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. బిళ్ల గ‌న్నేరుకు క్యాన్స‌ర్ కార‌కాల‌తో పోరాడే గుణం కూడా ఉంటుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని తాగ‌డంతోపాటు వేర్ల పొడితో డికాష‌న్ ను చేసుకుని రోజూ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డే స్త్రీలు బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను ఆరింటిని తీసుకుని రెండు క‌ప్పుల నీటిలో వేసి అర క‌ప్పు నీరు మిగిలే వ‌ర‌కు మ‌రిగించాలి. ఈ నీటిని వ‌డ‌క‌ట్టుకుని తాగ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ విధంగా బిళ్ల గ‌న్నేరు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM