OTT : ఈ మధ్య కాలంలో థియేటర్లలోకన్నా ఓటీటీల్లోనే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా థియేటర్ల కంటే ఓటీటీల్లో మూవీలు చూడడమే బెటర్ అని భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అనేక సినిమాలకు కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఇక వారం మారేకొద్దీ కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఓటీటీల పట్ల సహజంగానే ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్రో సైంటిస్టు నంబి నారాయణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అనే మూవీని ఈ వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఆర్.మాధవన్ నటించగా.. ఈ మూవీని ఈ నెల 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నారు. అలాగే విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 19 (1)(a) అనే మూవీ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. దీన్ని ఈ నెల 29వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో రిలీజ్ చేయనున్నారు.
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లి అనే మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఈ నెల 29వ తేదీన వూట్ అనే యాప్‌లో రిలీజ్ చేయనున్నారు. అలాగే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ అనే మూవీని ఈ నెల 29వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇలా పలు మూవీలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…