Manchu Lakshmi : మోహన్ బాబు కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన మంచు లక్ష్మి నటిగా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. అయితే ఈమె ఎక్కువ రోజుల పాటు అమెరికాలో ఉండి చదువుకోవడం వల్ల ఈమెకు తెలుగు సరిగ్గా రాదు. దీంతో ఇంగ్లిష్ యాసలో కలిపి తెలుగు మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఆమె యాసకు ఆమెను చాలా మంది విమర్శిస్తూ ట్రోల్ చేస్తుంటారు. ఇక ఈమె మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే వాటిని మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోదు.
ఇక ఈమధ్యే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించిన మంచు లక్ష్మి ఆ స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు తెలియజేసింది. మొత్తం 50 స్కూళ్లను దత్తత తీసుకున్నానని.. ఇకపై వాటి బాధ్యతలను తాను చూసుకుంటానని ఈమె గొప్ప మనసు చాటుకుంది. దీంతో ఈమెను ట్రోల్ చేసేవారు కూడా ఈమె గొప్ప మనసుకు, దాతృత్వానికి ఫిదా అయ్యారు. ఈమెను అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె పలు విషయాలను వెల్లడించింది.
మంచు లక్ష్మికి విద్యా నిర్వాణ అనే కుమార్తె ఉన్న విషయం విదితమే. అయితే కరోనా వల్ల ఇన్ని రోజుల పాటు తన కుమార్తె ఇంట్లోనే ఉందని.. దీంతో తనకు, ఆమెకు ఎంతో బాండింగ్ (అనుబంధం) ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అయితే సోమవారం (జూలై 25) తన కుమార్తెను స్కూల్‌కు పంపించానని.. దీంతో తనకు దుఃఖం ఆగలేదని తెలిపింది. తన కుమార్తెతో ఇన్ని రోజుల పాటు ఎలా ఉంటానా.. అని అనుకున్నానని.. కానీ ఆమెను ఇప్పుడు స్కూల్‌కు పంపిస్తుండడం బాధగా ఉందని.. అయితే ఇది తప్పదని.. దీనికి కూడా అడ్జస్ట్ కావాలని ఆమె చెప్పింది.
కాగా మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. తన తండ్రితో తొలిసారిగా కలసి అగ్ని నక్షత్రం అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ పోస్టర్‌ను ఈ మధ్యనే లాంచ్ చేశారు. దీంతోపాటు మళయాళ స్టార్ మోహన్ లాల్ సినిమాలోనూ ఈమె ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇందుకు గాను ఈమె కలరి విద్యను కూడా నేర్చుకుంది. అప్పట్లో ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈమె షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…