Chiranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని లూసిఫర్ రీమేక్ చిత్రమైన గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ అక్కడ జరుగుతుండగా మెగాస్టార్ చిరంజీవి ఉన్న ఫలంగా ఊటీ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఇలా ఊటీ నుంచి హైదరాబాద్ రావడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఊటీలో మెగాస్టార్ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో హైదరాబాద్ వచ్చారని పలువురు భావించగా, మరికొందరు మాత్రం.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హర్ట్ అయిన చిరంజీవి ఉన్న ఫలంగా హైదరాబాద్ వచ్చారని చెబుతున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. ఏపీ ప్రభుత్వం నుంచి, సినీ పరిశ్రమ నుంచి ఘాటుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై పరిశ్రమ నుంచి మద్దతు లేకపోవడం వల్ల ఈ విషయంలో చిరు బాగా హార్ట్ అవడం వల్లే ఉన్న ఫలంగా హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడటం కోసమే చిరంజీవి హైదరాబాద్ వచ్చారని మరి కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుపై చిత్రీకరించిన సన్నివేశాలు పూర్తి కావడంచేత వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉన్నఫలంగా హైదరాబాద్ రావడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.