Cumin Water : సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి అనేక మసాలా దినుసులు, పదార్థాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి జీలకర్ర. ఇది రుచిని పెంచడంతో పాటు ఆహార సువాసనను పెంచడంలో సహాయపడుతుంది. అయితే.. ఇది రుచికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. స్థూలకాయం కూడా అనేక వ్యాధులకు కారణం అవుతోంది.

జీలకర్ర మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని అన్ని టాక్సిన్‌లను కూడా తొలగిస్తుంది. అదే సమయంలో.. చర్మం, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, భాస్వరం ఉన్నాయి. ముఖ్యంగా జీలకర్ర కలిపిన నీరు బరువు తగ్గడానికి, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
Cumin Water : జీరా నీటిని ఇలా తయారు చేయవచ్చు
జీరా నీరు చేయడానికి ముందుగా ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో 1 నుండి 2 టీస్పూన్ల జీలకర్ర వేసి రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని మరిగించండి. నీటి పరిమాణంలో సగం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు గ్యాస్‌ను ఆపివేయండి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. మీరు మిగిలిన జీలకర్ర గింజలను నమలవచ్చు. మీకు నచ్చితే జీరా నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.
జీరా నీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి ?
జీరా నీరు అత్యంత ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయం. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు దీనిని తాగితే మీకు ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే రోజుకు 2 సార్లు ఈ నీటిని తాగాలి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.