Teenmar Mallanna : పలు కేసుల్లో అరెస్టు అయిన క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు క్యూ న్యూస్ టీమ్ ప్రకటించింది. ప్రధాని మోదీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో మల్లన్న చేరుతున్నారని తెలుస్తోంది.

కాగా మల్లన్న ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్నారు. ఆయనకు కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా.. ఇంకొన్ని కేసుల్లో రావల్సి ఉంది. ఇప్పటికే నెల రోజులుగా మల్లన్న రిమాండ్‌లో ఉన్నారు. అయితే మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తుండడం సంచలనం సృష్టిస్తోంది.
గతంలో చాలా సార్లు అనేక మంది మల్లన్న వెనుక బీజేపీ పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలు ఇప్పుడు నిజం అయినట్లు అయింది. అయితే బీజేపీలో చేరుతున్నారు కనుక మల్లన్న చాలా త్వరగా విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.