Black Pepper Water : మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఎంతటి కీలకపాత్రను పోషిస్తుందో అందరికీ తెలిసిందే. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోతే మనకు అనేక వ్యాధులు వస్తాయి. అవి ఎప్పటికీ తగ్గవు. ముఖ్యంగా చలికాలంలో మనకు దగ్గు, జలుబు అధికంగా వస్తాయి. ఇలాంటి సమయంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలి. అప్పుడే మనకు వచ్చే సీజనల్ సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయరు. కానీ ఈ విషయంపై తప్పక దృష్టి సారించాలి. ఇక రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మిరియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసే నీళ్లను ఈ సీజన్‌లో రోజూ తాగాలి. దీంతో దగ్గు, జలుబు వంటివే కాదు.. అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మిరియాల నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే ఈ సీజన్‌లో బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మిరియాల నీళ్లను రోజూ తాగాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. మిరియాలు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో ఇది మనకు ఎంతగానో మేలు చేసే విషయం.
చలికాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. దీంతో అజీర్ణం ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం వంటి సమస్యలు కూడా ఈ సీజన్‌లోనే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు మిరియాల నీళ్లను తాగితే తప్పక ఫలితం ఉంటుంది. మిరియాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. వంటల్లో కారంకు ప్రత్యామ్నాయంగా మిరియాల పొడిని వాడుకోవచ్చు. దీంతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఇక మిరియాల నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల నీళ్లను తీసుకోవాలి. మిరియాలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దంచి పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు సన్నని మంటపై మరిగించాలి. అనంతరం వడకట్టాలి. దీంతో మిరియాల నీళ్లు రెడీ అవుతాయి. అయితే ఇవి ఘాటుగా ఉన్నాయనుకుంటే రుచి కోసం కాస్త తేనె కలుపుకోవచ్చు. ఇలా మిరియాల నీళ్లను తయారు చేసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం లేదా రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…