Pavithra Lokesh : గత కొద్ది కాలంగా నరేష్-పవిత్ర- రమ్యల వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నరేష్.. తన తోటి నటి పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. రమ్యా రఘుపతికి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఈ మధ్యే నరేష్-పవిత్ర లోకేష్ ఓ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.
ఈ వివాదం రోజురోజుకి మరింత పెరుగుతుండడంతో వీరిద్దరు గొడవలు నాకెందుకని , వీటిని ఈ విధంగా ఎన్నాళ్లు భరించాలి అని పవిత్ర లోకేష్ బెంగళూరుకు వెళ్లి పోయినట్టు తెలుస్తోంది. నరేష్ రీసెంట్‌గా తనకు ప్రాణ హాని ఉందని, హత్యకు కుట్ర జరిగిందని పలు కామెంట్స్ చేశారు. ఈ పరిస్థితులన్నింటిని చూసి పవిత్ర లోకేష్ సైలెంట్ గా బెంగళూరు వెళ్ళిపోయిందని, ఇకనుంచి నరేష్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది అనే దానిపై రానున్న రోజులలో క్లారిటీ రానుంది.
నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రకు కూడా ఇంతకు ముందే పెళ్లి అయింది. గతంలో నరేష్ పవిత్ర.. తమ రిలేషన్ పై బహిర్గంగానే కామెంట్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని.. పెళ్లి చేసుకోలేదని.. తమని సపోర్ట్ చేయాలని.. చెప్పుకొచ్చారు. నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్ గదిలో ఉండగా… నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.. ఆమె… వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…