Ileana : హీరోయిన్ల లైఫ్ అంటేనే అంత. అవకాశాలు వచ్చి సినిమాలు హిట్ అయితే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. కానీ ఆ స్టేటస్ ఎంతో కాలం ఉండదు. నాలుగు ఫ్లాప్‌లు పడితే చాలు.. హీరోయిన్లను ఎవరూ చూడరు. ఇలా తెరమరుగు అయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం తమ కెరీర్‌ను అనవసరంగా నాశనం చేసుకున్నారు. అలాంటి వారిలో ఇలియానా ఒకరని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే అక్కడ నిలదొక్కుకోవాల్సింది పోయి లవ్ అంటూ పరుగెత్తింది. కానీ అక్కడ బోల్తా కొట్టింది. దీంతో అటు ప్రేమలో విఫలం అవడమే కాక.. ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె ఉంది. అయితే ఇలియానా తాజాగా హాస్పిటల్ బెడ్‌పై కనిపించే సరికి అందరూ షాకవుతున్నారు. ఆమెకు ఏమైంది.. అంటూ ఆరా తీస్తున్నారు.
గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరం అయ్యాక లవ్‌లో బ్రేకప్ అయ్యి చాలా కాలం పాటు మీడియా ముందుకు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది సోషల్ మీడియా ద్వారా. అందులో తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. అయితే ఎక్కువగా విదేశాలకు ట్రిప్పులు వేస్తున్న ఈ భామ తాజాగా ఓ చోట అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే హాస్పిటల్ లో చేరింది. తనకు మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కించారని చెప్పింది. అయితే తనకు ఏం జరిగింది.. అన్న విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో బహుశా ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చు.. అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇలియానా త్వరగా కోలుకోవాలని ఆమెకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో వాటికి ఆమె స్పందించింది.
తాను కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పింది. త్వరలోనే మళ్లీ అంతా నార్మల్ అవుతుందని.. మళ్లీ మీ ముందుకు వస్తానని తెలియజేసింది. ఇక ఇలియానా లవ్ బ్రేకప్ అయ్యాక తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది. దీంతో విపరీతంగా లావైంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ క్రమంలోనే అవకాశాలు చేజారిపోయాయి. అయితే ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవి పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇల్లీ బేబీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆమె తెలుగులో చివరిసారిగా రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో నటించింది. ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఆమెకు తెలుగులోనూ అవకాశాలు క్లోజ్ అయ్యాయి. ఇక ఇల్లీ బేబీ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…