Bigg Boss : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ముగిసిపోతుంది. 11 వారాల్లో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ లో కేవలం 8 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మానస్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాలి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం షణ్ముఖ్, సన్నీలు ఫస్ట్ రెండు స్థానాల్లో ఉన్నారు. నామినేషన్స్ లోకి వెళ్లిన ప్రతిసారి వీరిద్దరికీ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది.
వీరిద్దరి తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో యాంకర్ రవి, శ్రీరామచంద్రలు ఉన్నారు. చివరి మూడు స్థానాల్లో అమ్మాయిలు పోటీపడుతున్నారు. కనుక ఈ వారం బిగ్ బాస్ నుండి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కాజల్, సిరి, ప్రియాంక ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. ఇక స్ట్రాటజీ అంటూ మొదట్నుండి తన స్టైల్ లో గేమ్ ఆడుతున్న కాజల్ ను కూడా అభిమానులు తెగ ఓట్లేసి గెలిపిస్తున్నారు. సిరి గేమ్ స్టార్ట్ అయితే చాలా చక్కగా గేమ్ ఆడేస్తుంది. కనుక మిగతా వారితో పోల్చుకుంటే సిరికి కూడా కాస్త గట్టిగానే ఓట్లు పడుతున్నాయి.
ప్రస్తుతం ప్రియాంక సింగ్ కు ఓట్లు తక్కువ పడుతున్నాయనేది అనధికారిక సమాచారం. ఈ క్రమంలో మానస్ నామినేషన్స్ లో లేకపోయినా.. మానస్ ఫ్యాన్స్ పింకీకి ఓట్లు వేయాలంటే ఆలోచిస్తున్నారట. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో పింకీ ఉంటే మానస్ గేమ్ కి ప్రాబ్లెమ్ అవుతుందని, మానస్ టాప్ 5 లో ఉండటం బహుశ కష్టం ఏమోనని ఆలోచిస్తున్నారట. అందుకే పింకీకి ఓట్లు వేయటంలో కాస్త తటపటాయిస్తున్నట్లు సమాచారం. అందుకే పింకీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుండి బయటకు పంపేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…