Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షో ఓవైపు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు సెలబ్రిటీ హోదాను తెచ్చి పెడుతోంది. కేవలం పాపులారిటీకి మాత్రమే పరిమితం కాకుండా కాసులు కూడా కురిపిస్తోంది. ఈ షోలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ సొంతిటిని నిర్మించుకుంటే, మరికొందరు కార్లను కొనుగోలు చేసుకుంటున్నారు.
హిమజ, సోహెల్, అఖిల్, అరియానా, శివజ్యోతి, శ్రీముఖి కొత్త కార్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి విశ్వ కూడా వచ్చి చేరాడు. బీఎం డబ్ల్యూ కారు కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు స్కూల్ ఫీజుకి కూడా డబ్బులు లేవని చెప్పిన అతను అంత కాస్ట్‌లీ కారు ఎలా కొన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే విశ్వ కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. మొత్తానికి నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని కల నెరవేర్చుకున్నాను. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇవే నా కృతజ్ఞతలు. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
టాస్క్‌లో గట్టి పోటీ ఇచ్చే విశ్వ.. బిగ్ బాస్ ఇంట్లోనూ అందరితో కలిసిపోయేవాడు. కానీ ఎక్కువగా సింపతీ కార్డు ఉపయోగించాడనే ముద్ర పడిపోయింది. ఎక్కువగా ఏడ్వడం, ప్రేక్షకుల్లో సింపతీ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడా ? అనే అనుమానం పెరిగింది. ఈ కారణంగానే తొందరగా ఎలిమినేట్ అయ్యాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…