తమిళ స్టార్ హీరో విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు నటించిన తాజా చిత్రం.. బీస్ట్. ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే విడుదలైన మొదటి రోజు నుంచే ఈ మూవీకి భారీ ఎత్తున నెగెటివ్ టాక్ వచ్చింది. సాక్షాత్తూ విజయ్ అభిమానులే సినిమా బాగా లేదని చెన్నైలో ఓ చోట ఏకంగా స్క్రీన్‌ను తగులబెట్టారు. దీంతో సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించింది. కనుక సన్ నెక్ట్స్ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
కాగా బీస్ట్ చిత్రం మరీ పేలవంగా ఉందని చాలా చోట్ల కామెంట్స్ వినిపించాయి. అయితే భారీ ఎత్తున రిలీజ్ చేశారు కనుక పెట్టిన డబ్బు వచ్చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ ఒక్క చిత్ర పరిశ్రమలోనూ మంచి టాక్‌ను సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్‌కు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌తోపాటు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్‌లోనూ బీస్ట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా చాలా త్వరగానే ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన విడుదల అయింది కనుక మే 13వ తేదీ తరువాతే వాస్తవానికి ఓటీటీలో రావాల్సి ఉంది. కానీ ఫ్లాప్ టాక్‌ను మూట గట్టుకుంది కనుక ఒక వారం ముందే.. అంటే.. మే 5 లేదా 6వ తేదీల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజుల్లోనే రూ.150 కోట్లు వచ్చేశాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. కనుక నెగెటివ్ టాక్ వచ్చినా.. లాస్ అనేది ఏర్పడలేదని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…