Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ ఒకరనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పెళ్లి కావల్సి ఉంది. మరోవైపు వయస్సు కూడా మీద పడుతోంది. దీంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా..? అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో బాహుబలి మూవీ కోసం ఆగారని.. ఆ మూవీ రెండు పార్ట్‌ల విడుదల అనంతరం ప్రభాస్ పెళ్లి ఉంటుందని.. అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ మూవీలో నటించిన అనుష్క శెట్టితో ప్రభాస్ వివాహం జరుగుతుందని.. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ వారు ఆ వార్తలను ఖండించారు. ఇక ప్రభాస్ పెద్దమ్మ, పెదనాన్న కూడా ప్రభాస్ పెళ్లి విషయాన్ని అతనికే వదిలేశామని తేల్చి చెప్పేశారు. దీంతో పెళ్లి విషయం మళ్లీ ప్రభాస్ వద్దకే చేరింది. దీంతో ఆయన ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనని.. ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి విషయమై ప్రభాస్‌కు ఎక్కడికి వెళ్లినా ప్రశ్నలు తప్పడం లేదు. రాధేశ్యామ్ చిత్ర ప్రమోషన్లలో ఆయన పలు చోట్లకు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం వెళ్లారు. ప్రెస్ మీట్‌లకు హాజరయ్యారు. అయితే ఎక్కడికి వెళ్లినా.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు ? అనే ప్రశ్నే కామన్‌గా ఎదురవుతోంది. దీంతో ప్రభాస్.. తాను ప్రేమ, పెళ్లి విషయాలను తప్పుగా అంచనా వేశానని.. అయితే పెళ్లి తప్పక చేసుకుంటానని.. కానీ తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలని క్లారిటీ ఇచ్చేశారు. కానీ తాజాగా మరోమారు ఆయనకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్‌ను నిర్వాహకులు పెళ్లిపై ప్రశ్నలు అడిగారు. మిమ్మల్ని పెళ్లి ఎప్పుడు అని తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు కదా.. మీకు కోపం రాదా.. అని అడగ్గా.. లేదు.. ఆ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా నేనేమీ అనుకోను.. అన్నారు. ఇక పెళ్లి ఎప్పుడు అవుతుంది ? మీ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. అని అడగ్గా.. దీనికి ప్రస్తుతం తన వద్ద సమాధానం లేదని.. త్వరలోనే కచ్చితమైన సమాధానం చెబుతానని.. నవ్వుతూ ప్రభాస్ చెప్పేశారు. దీంతో ఆయన పెళ్లి వార్త కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…