వేటాడం అనేది క్రూర జంతువులకు ఉండే సహజమైన లక్షణం. తమ ముందు ఏదైనా జంతువు కనిపిస్తే చాలు.. అవి అమాంతం మీద పడి చంపేస్తాయి. వాటిని తమకు ఆహారంగా చేసుకుంటాయి. ఇక క్రూర మృగాల్లో ఒకటైన చిరుత పులి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేటాడడంలో ఇవి దిట్టలు. కొండ చిలువ లాంటి భారీ పాములు ఎదురుగా వచ్చినా సరే.. ఇవి వేటాడుతాయి. కానీ కొండ చిలువలు కూడా తక్కువేమీ తినలేదు. అవి కూడా చిరుత పులులను చుట్టి వేసి చంపేయగలవు. మరి అలాంటి రెండు జీవులు పోరాటం చేస్తే ఎలా ఉంటుంది ? వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది కదా. అవును.. సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పొదల్లో దాక్కున్న ఓ కొండ చిలువను చూసి ఓ చిరుత పులి దాని వైపుకు వెళ్లింది. దాన్ని పొదల నుంచి బయటకు లాగింది. అయితే బయటకు వచ్చిన కొండ చిలువ మాత్రం చిరుతను చుట్టేయబోయింది. కానీ చిరుత చాలా తెలివిగా తప్పించుకుంది. తరువాత రెండూ పోరాటం చేశాయి. చివరకు చిరుత పులే గెలిచింది. కొండ చిలువను అది నోట కరుచుకుని ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా ఈ వీడియోను యూట్యూబ్‌లో న్యాప్ నెట్‌వర్క్ అనే చానల్ షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చిరుత, కొండ చిలువ పోరాటంలో ఏది గెలిచిందో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…