David Warner : ఐపీఎల్‌లో చాలా సీజన్లకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలోనే తెలుగు వారు అతనితో చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. పలు తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ.. పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. వార్నర్ అలరించేవాడు. అలా వార్నర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే వార్నర్‌ను గత ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాద్ రిటెయిన్ చేసుకోలేదు. దీంతో వార్నర్ ప్రస్తుతం హైదరాబాద్‌కు ఆడడం లేదు. ఢిల్లీ అతన్ని కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వార్నర్ ఈ సీజన్‌లో ఆడుతున్నాడు.
అయితే వార్నర్ ఇంకో జట్టు మారినా.. భారతీయ సినిమాలకు డబ్ స్మాష్ చేయడం మాత్రం మానలేదు. తాజాగా అతను కేజీఎఫ్ చాప్టర్ 2 లోని యష్ డైలాగ్.. వయలెన్స్.. ను డబ్ స్మాష్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. డేవిడ్ వార్నర్‌కు ఇండియన్ మూవీలు అంటే ఎంతో ఇష్టం. అందులో భాగంగానే ఆ మూవీలకు చెందిన పాటలు లేదా డైలాగ్‌లకు డబ్ స్మాష్ చేస్తుంటాడు.
ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుతం 8వ స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ జట్టు 7వ స్థానంలో ఉంది. గత 3 మ్యాచ్‌లలోనూ హైదరాబాద్ జట్టు వరుసగా గెలుపొంది మంచి జోరు మీద ఉంది. ఇక ఈ సీజన్‌లో ప్రస్తుతం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. 5 సార్లు టైటిల్‌ను గెలిచిన ముంబై మాత్రం పేలవమైన ప్రదర్శనతో చివరి స్థానంలో కొనసాగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…