Balakrishna : బాలయ్య, కొర‌టాల‌ కాంబో ఫిక్స్.. టైటిల్ కూడా ఓకే.. ఇక దబిడి దిబిడే..!

Balakrishna : అఖండతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఎన్.బి.కె 107 సినిమాగా వస్తున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాల‌ను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాస్ టు F3 సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా తన సత్తా చాటుతున్న అనిల్ రావిపుడి బాలయ్య బాబుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ డైరక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ 30వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బాలయ్యతో ఒక మూవీ అనుకుంటున్నారు కొరటాల శివ. కరోనా లాక్ డౌన్ టైం లో బాలకృష్ణ ఇమేజ్ కి సరిపడే ఒక కథ రాసుకున్నారట కొరటాల శివ. ఆ కథని బాలయ్యకి కూడా వినిపించగా ఓకే అనేశారట. కొరటాల శివ కథ రాసుకున్నప్పుడే బాలయ్య సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. మోనార్క్ టైటిల్ తో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు.

Balakrishna

గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమాను లైన్ లో పెట్టిన బాలకృష్ణ ఆ తర్వాత కొరటాల శివ సినిమానే చేస్తారని తెలుస్తోంది. అఖండ తర్వాత సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు బాలయ్య బాబు. ఈసారి వరుసగా స్టార్ డైరక్టర్స్ తో బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలన్నీ నందమూరి ఫ్యాన్స్ అంచనాలను మించేలా ఉంటాయని చెప్పొచ్చు.

Share
Ramesh B

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM