Narasimha Naidu : నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నరసింహ నాయుడు. ఆల్రెడీ సమరసింహా రెడ్డి తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరక్టర్ గోపాల్ మరోసారి బాలయ్యతో నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. 2001 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. అప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లోనే కాదు సినీ పరిశ్రమలో ఇదివరకు ఏ సినిమా సృష్టించని రికార్డులను సృష్టించింది. 104 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.30 కోట్ల దాకా వసూళ్లని రాబట్టింది.
ఇక ఈ సినిమాకు కథని చిన్ని కృష్ణ అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. అయితే ఈ సినిమా కథని బీహార్ లో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని రాసినట్టు రైటర్ చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కొందరు రౌడీ మూక గ్రామాలపై దాడి చేస్తుంటే.. వాళ్లని ఎదుర్కునేందుకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికోసం ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మగ పిల్ల వాడిని ఆ సైన్యానికి అప్పగించేవారట. అప్పగించిన ఆ మగ పిల్లాడిపై ఆశలు వదులుకోవాల్సిందేనట. ఇదే లైన్ తో చిన్ని కృష్ణ నరసింహ నాయుడు కథ రాసుకున్నారు.
సమర్ సింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ బాగా నడిచింది. ఇలాంటి సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా మారారు. బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తే సూపర్ హిట్టే అన్న టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా బాలకృష్ణ అలాంటి కథలు చేయగా అవి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…