Balakrishna : అఖండతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఎన్.బి.కె 107 సినిమాగా వస్తున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాస్ టు F3 సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా తన సత్తా చాటుతున్న అనిల్ రావిపుడి బాలయ్య బాబుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ డైరక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ 30వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బాలయ్యతో ఒక మూవీ అనుకుంటున్నారు కొరటాల శివ. కరోనా లాక్ డౌన్ టైం లో బాలకృష్ణ ఇమేజ్ కి సరిపడే ఒక కథ రాసుకున్నారట కొరటాల శివ. ఆ కథని బాలయ్యకి కూడా వినిపించగా ఓకే అనేశారట. కొరటాల శివ కథ రాసుకున్నప్పుడే బాలయ్య సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. మోనార్క్ టైటిల్ తో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు.

గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమాను లైన్ లో పెట్టిన బాలకృష్ణ ఆ తర్వాత కొరటాల శివ సినిమానే చేస్తారని తెలుస్తోంది. అఖండ తర్వాత సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు బాలయ్య బాబు. ఈసారి వరుసగా స్టార్ డైరక్టర్స్ తో బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలన్నీ నందమూరి ఫ్యాన్స్ అంచనాలను మించేలా ఉంటాయని చెప్పొచ్చు.