iPhone SE3 : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్‌ను త్వరలో విడుదల చేస్తుందని తెలుస్తోంది. మార్చి 8వ తేదీన నిర్వహించనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్ ఎస్ఈ ఫోన్ తోపాటు నూతన ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌ను విడుదల చేస్తుందని తెలుస్తోంది.

ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌లో యాపిల్ ఎ15 బయానిక్ చిప్‌ను అందించనున్నట్లు సమాచారం. దీనికి 5జి సపోర్ట్ లభించనుంది. ఐఫోన్ ఎస్ఈ 2 లాగే టచ్ ఐడీ సెన్సార్‌ను హోమ్ బటన్ కింద అందిస్తారని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కనీస ధర 399 డాలర్లు.. అంటే దాదాపుగా రూ.29,800 ఉంటుందని తెలుస్తోంది.
ఇక కొత్త ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్‌లో యాపిల్ ఎ15 చిప్, 5జి సపోర్ట్, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరా, సెంటర్ స్టేజ్ సపోర్ట్, క్వాడ్ ఎల్ఈడీ ట్రూ టోన్ ఫ్లాష్, 10.9 ఇంచుల డిస్‌ప్లే, టచ్ ఐడీ పవర్ బటన్, యూఎస్‌బీ టైప్ సి పోర్టు.. వంటి ఫీచర్లను అందిస్తారని తెలుస్తోంది.
ఇక అదే ఈవెంట్ లో ఓ నూతన మాక్‌ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఇంకా బయటకు తెలియలేదు.