కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జరిగినా సరే కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు గురించి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. విశాఖపట్నంలోనూ సరిగ్గా అలాంటి ఆశ్చర్యపోయే, అబ్బురపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వయస్సు ఉండగా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వయస్సు ఉండేది. అయితే వారిద్దరినీ తీసుకుని వారి బామ్మ భద్రాచలం ఆలయానికి బోటులో గోదావరి నదిపై బయల్దేరింది. కానీ దురదృష్టవశాత్తూ బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు చనిపోయారు.
ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తరువాత మళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ ఆడ పిల్లలే. ఆ రోజున ప్రమాదంలో చనిపోయిన వారే మళ్లీ ఇప్పుడు కవల పిల్లల రూపంలో తమకు పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంపతులదే అని చెప్పవచ్చు. చనిపోయారనుకున్న కుమార్తెలు మళ్లీ ఇలా కవలల రూపంలో జన్మించారని వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…