పెళ్లి చేసుకున్నా అతను భార్యను రూ.లక్షలు ఖర్చు పెట్టి చదివించాడు. వీసా, పాస్‌పోర్టు వంటి పనులకు కూడా ఎంతో మొత్తం ఖర్చు చేశాడు. చివరకు అతను తన భార్యను విదేశాలకు పంపాడు. కానీ ఆమె మాత్రం తన సోదరులతో కలిసి భర్తను మోసం చేసింది. వివరాల్లోకి వెళితే..
చండీగఢ్‌కు చెందిన మన్‌వీర్ సింగ్ మండ్, అదే ప్రాంతానికి చెందిన గుర్‌కమల్ కౌర్‌లకు 2019లో వివాహం జరిగింది. గుర్ కమల్ కౌర్‌కు పరంజిత్ సింగ్, పుష్పీందర్ సింగ్ అనే ఇద్దరు సోదరులు, సురీందర్ కౌన్ అనే సోదరి ఉన్నారు. అయితే పెళ్లయ్యాక మన్‌వీర్ సింగ్ తన భార్యను బాగా చదివించాడు. విదేశాలకు ఆమెను ఉద్యోగం కోసం పంపి కొంతకాలం గడిచాక తాను కూడా అక్కడికి వెళ్లి స్థిర పడవచ్చని అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని మోసం చేసింది.
గుర్ కమల్ కౌర్ చదువుతోపాటు వీసా, పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లు, ఇతర పనులకు మన్‌వీర్ సింగ్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. చివరకు ఆమెను విదేశాలకు కూడా పంపాడు. కానీ ఆమె అక్కడికి వెళ్లగానే మన్‌వీర్ సింగ్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మన్‌వీర్ సింగ్ ఆమెతోపాటు ఆమె సోదరులపై కేసు పెట్టాడు.
అయితే ఆమె సోదరులు మన్‌వీర్‌తో రాజీ యత్నం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని మన్ వీర్‌ను ఒప్పించారు. కానీ వారు రూ.7 లక్షలు మాత్రమే ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని మన్‌వీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…