Andhra Pradesh : ఏపీలో ఒక క్రమ పద్ధతిలో సంపూర్ణంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం విదితమే. అయితే అందులో భాగంగానే ఎప్పటికప్పుడు మద్యం ధరలను పెంచుతూ.. మద్యం దుకాణాలు, బార్లను తగ్గిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా షాకిచ్చింది. మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో మద్యం ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఇక తగ్గిన ధరలు ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చాయి.
ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు శనివారమే ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. ఇక తగ్గిన మద్యం ధరల వివరాలను కింద పట్టికలను చూసి తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో వచ్చే వారంలోపు అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో మద్యం వినియోగం తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం ఉన్న ఫలంగా ఇలా మద్యం ధరలను తగ్గించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా మద్యం ధరలను తగ్గిస్తే మళ్లీ మద్యం వినియోగం పెరుగుతుంది కదా.. అని అంటున్నారు. మరి మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఏపీ ప్రభుత్వం సడెన్‌గా మద్యం ధరలను ఎందుకు తగ్గించిందో.. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…