Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల కావల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4, 2022న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ అనుకున్న తేదీ లోపు పనులన్నింటినీ పూర్తి చేసి సినిమాను కచ్చితంగా విడుదల చేయాల్సిందేనని.. నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. దీంతో ఈసారి ఎలాంటి వాయిదా లేదని అర్థమవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ విడుదల కావల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడడం చేత ఫ్యాన్స్ నిరాశ చెందుతూ వచ్చారు. అయితే తాజా వార్త అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది.
ఈ మూవీని మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తేజలు నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డె నటించగా, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆచార్యపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…