వినోదం

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నర్సింగి పోలీసులకు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై తొలుత 375 అత్యాచారంతోపాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోక్సో కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వయస్సు దృష్ట్యా ఈ కేసు నమోదు చేశారు.జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని విచారించేందుకు నోటీసులు అందచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ లో లేడని తెలుస్తుంది. అతను నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నార్సింగ్ పోలీసులు.. నెల్లూరు పోలీసులతో సంప్రదింపులు జరిపి.. మొదట నోటీసులు అందచేసి విచారణ కొనసాగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవ్వడంతో.. జాని మాస్టర్ నెల్లూరులో ఎక్కడ ఉన్నారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు కావడంతో.. బంధువుల ఇంట్లోనే ఉండి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది..కొన్ని రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తిరు అనే తమిళ చిత్రానికి జాతీయ అవార్డు ని అందుకున్న జానీ మాస్టర్ 2009 లో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ ని అందించాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యు గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు జానీపై మండి పడుతున్నారు. తాను మైనర్ గా ఉన్నప్పటినుంచే జానీ మాస్టర్ ఆమెను వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు పేర్కొంది. ఇదే విషయం ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా బయటకు తీసుకుని వచ్చింది. అసలు నిజా నిజాలు ఏమై ఉంటాయి అనేది జానీ మాస్టర్ ను కూడా విచారిస్తే కానీ తెలియదు. మరి కొద్దీ రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపడనున్నాయి. ఏదేమైనా పోలీసులు అన్ని కోణాలలో విశ్లేషించి.. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలంటూ నెటిజన్లు కూడా వాపోతున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM