Ananya Pandey : బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ తెలుగులో కూడా లైగర్ సినిమాతో పరిచయం కానుంది. ఇక ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి అతి తక్కువ సమయంలో పరిచయమై మంచి అభిమానాన్ని చూరగొంది.

2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే తన నటనకు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అదే ఏడాది మరో సినిమాలో కూడా నటించింది. ఇక వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది.

తన ఫోటో షూట్‌లతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఫోటోను పంచుకోగా అందులో నడిసంద్రంలో సూర్యకిరణాల తాకిడితో ఎద అందాలతో ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.
